కాంతార సినిమా టాక్ మామూలుగా లేదుగా మరి..!!
ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో తాము సైతం సినిమాలు తెరకెక్కించగలమని కన్నడ ఇండస్ట్రీ నిరూపించింది మరి . అయితే అలాంటి బిగ్ హిట్ మూవీని కూడా వెనక్కి నెట్టేసింది రిసేంట్ మూవీ కాంతార. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లోనే తెరకెక్కిన కాంతార.. ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది.
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు అంటా . తాజాగా ఈ సినిమా మరో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక అక్టోబర్ 14న హిందీలో విడుదల కాగా ఈ మూవీ ఐఎండీబీ రేటింగ్ 9.4 సాధించి రికార్డుకెక్కింది. అంతేకాదు.. రాకింగ్ స్టార్ యశ్ నటించి కేజీఎఫ్.. ఆరఆర్ఆర్ చిత్రాలను వెనక్కు నెట్టి మరీ నెంబర్ వన్ గా నిలిచింది. కేజీఎఫ్ చిత్రానికి (8.4)కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాకు (8) రేటింగ్ ఉన్నాయి.
ప్రస్తుతం అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా నిలిచింది కాంతార చిత్రం . ప్రేక్షకులు సినిమాలకు ఇచ్చే రేటింగ్‌కు ప్రామాణికంగా భావించే ఐఎండీబీ లో మరో కన్నడ సినిమా కేజీఎఫ్ 2ను వెనక్కి నెట్టి కాంతారా ఈ రికార్డు సృష్టించింది. కాంతారాకు ప్రస్తుతం ఐఎండీబీలో 9.4 రేటింగ్ ఉండటం విశేషం. కాంతార.. కంబ్లా, బూటా కోలా సంప్రదాయ సంస్కృతిని అన్వేషించే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గా రూపు దాల్చింది . ఇందులో రిషబ్ శెట్టి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు అని టాక్ . ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలకపాత్రలలో నటించారు అంటా మరీ.