'కాంతారా' చూసిన ప్రభాస్ - 'సలార్'కు స్పెషల్ షో....!!

murali krishna
కన్నడ హిట్ సినిమా 'కాంతారా' ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  చూశారు. సారీ... 'సలార్' చూశారు. ఆయన కోసం హోంబలే ఫిలింస్ సంస్థ స్పెషల్ షో వేశారు.ఎందుకంటే... 'కాంతారా' నిర్మించిన హోంబలే సంస్థ, ఇప్పుడు ప్రభాస్ కథనాయకుడిగా 'సలార్' సినిమా (Salaar Movie) ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ రెండు సినిమాలకు నిర్మాత విజయ్ కిరగందూర్. ప్రభాస్ సినిమా చూడటం వెనుక అసలు సంగతి అది! త్వరలో ఈ సిని మా గురించి సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.'కాంతారా'  సినిమా సెప్టెంబర్ 30న విడుదలైంది. కర్ణాటకలో మాత్రమే కాదు... ఇతర రాష్ట్రాల్లోనూ సినిమా విడుదలైంది. కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు... సినిమా చూసిన ఇతర భాషల ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడీ సినిమాను తెలుగు, హిందీ భాష ల్లో విడుదలకు రెడీ అయ్యింది. ప్రభాస్ చూసింది కూడా 'కాంతారా' తెలుగు వెర్షన్! ప్రభాస్ ల్యాబ్స్ ‌లో గురువారం రాత్రి ఆయ నకు స్పెషల్ షో వేశారు.

ప్రభాస్ కాకుండా  మరో ము గ్గురు నలుగురు మాత్రమే సినిమా చూశారు. ఆయనతో పాటు ల్యాబ్స్‌లో ఉన్నారని సమాచారం. సినిమా చూశాక... చాలా బావుందని ప్ర భాస్ మెచ్చుకు న్నట్లు తెలుస్తోంది.
 'కాంతారా' తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 15న... అనగా రేపే (శనివారం) థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుండటంతో... తెలుగు ప్రేక్షకు లు సైతం ఆసక్తి కనబరు స్తున్నారు.'కాంతారా' అనేది సంస్కృత పదం! అంటే... అడవి అని అర్థం! అడవి తల్లిపై మనం ఎంత ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను... ఎంత విధ్వంసం సృష్టిస్తే... అంతకు మించి ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అనే కథాంశంతో 'కాంతారా' సినిమా రూపొందింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: