దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను అంతకంతకు ఆలస్యం చేయడం ఒక యువ డైరెక్టర్ కెరియర్ పై ఎంతో ప్రభావం చూపిస్తుంది అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ప్రేక్షకులను అలరించే సినిమాలను చేయాలని చెప్పి ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు. స్క్రిప్ట్ విషయం లో ఏ మాత్రం అనుమానం వచ్చినా సదురు సినిమాను రిజెక్ట్ చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.
ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమాను ఇప్పటికే రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ సినిమాను కూడా రిజెక్ట్ చేయక తప్పడం లేదని ఈ సినిమా రోజురోజుకు ఆలస్యం అవుతుండడాన్ని బట్టి చెప్పవచ్చు. స్క్రిప్ట్ విషయంలోనే ఈ ఇద్దరు కూడా ఏకాభిప్రయానికి రాలేక పోతున్నారట. ఒకరికొకరు ఒకే అభిప్రాయం పై ఉండలేకపోతున్నారట. దాంతో ఈ సినిమా అసలు ఉంటుందో లేదో అన్న అభిప్రాయం ఇప్పుడు చిత్ర బృందంలో ఏర్పడింది. త్వరలోనే ఈ సినిమా విషయం ఏదో ఒకటి తేల్చనున్నారు.
అయితే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్న బుచ్చిబాబుపై ఈ సినిమా చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి. ఇప్పటికే కథతో ఒప్పించి ఫుల్ వెర్షన్ తో మెప్పించి షూటింగ్ వెళ్లడానికి రెడీగా ఉన్న ఈ దర్శకుడు కొరటాల శివ సినిమా ఉన్న కారణంగా సెట్లోకి వెళ్ళలేకపోతున్నాడు. దాంతో కొరటాల శివ ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బుచ్చిబాబు రెండవ సినిమానే ఇంతటి పెద్ద హీరోతో చేయాలనుకోవడం నిజంగా పెద్ద విశేషం అనే చెప్పాలి. చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. ఈ సినిమా కనుక బాగా ఆడితే తప్పకుండా బుచ్చిబాబు రెండవ సినిమాతోనే అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోవడం ఖాయం అని చెప్పాలి.