చైతు సినిమా కోసం వీరిని దింపారుగా!!
చివరికి ఆ అవకాశం చైతూకి దక్కడం విశేషం. ఈ విజయంతో చైతు మూవీపై భారీ అంచానాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది అని చెప్తున్నారు. ఈ సినిమా లో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటక లో ఈ సినిమా యొక్క షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా యొక్క షూటిగ్ సమయంలో కర్ణాటకలో వివాదం జరిగింది. మద్యం షాపు సెట్ వేయడంతో అక్కడి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ప్రకటించింది. ఇందులో నటిస్తున్న కొంతమంది నటీనటులను ప్రకటించింది చిత్ర బృందం.
ప్రియమణి కీలక పాత్రలో నటించనుంది. ఆమెకి వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. ఇంకా సంపత్ రాజ్ కూడా ఈ సినిమా లో కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇక మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో విల్లన్ గా అందాల నటుడు అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది.దీనిపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. అరవింద్ స్వయ నటిస్తే ఈ సినిమా కి మంచి హైప్ వస్తుందని చెప్పొచ్చు. తెలుగు ధ్రువ సినిమా తర్వాత అయన నటిస్తున్న సినిమా ఇదే.