ఈ ఒక్క సినిమానే కన్నడ ఇండస్ట్రీని మార్చేసిందా..?
ఇలాంటి మార్పులే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా మొదలవుతున్నాయి. కే జి ఎఫ్ చిత్రం విడుదలకు ముందు వరకు కనడ సినీ పరిశ్రమ గురించి ఇతర భాషలకు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఎప్పుడైతే 2018లో యష్ K.G.F సినిమా విడుదల అయిందా అప్పటినుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కించారు. ఈ సినిమాతోనే దేశవ్యాప్తంగా కన్నడ సినిమా పేరు ప్రఖ్యాతలు మారుమోగాయని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా అందించిన జోష్ తో అక్కడి సినీ నటులు కూడా ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టే సినిమాలని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక తర్వాత కేజిఎఫ్ -2 సినిమా విడుదలై మరొకసారి ట్రెండును సెట్ చేసింది ఇక ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా తన ఆహ్వాని కొనసాగిస్తుంది. ఇక తర్వాత రక్షిత్ చెప్పిన చార్లీ -777, కీచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ తదితర సినిమాలు కన్నడ ఇండస్ట్రీకి మంచి పేరు తెచ్చేలా చేశాయి అయితే తాజాగా విడుదలైన కాంతారా సినిమా కన్నడ ఇండస్ట్రీకి మరింత హైపును తీసుకువచ్చింది. ఈ చిత్రంతో డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి రెండు ఈ నటుడే చేశారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.