ఊ అంటావా నే తోపు అంటున్న బాలీవుడ్!!

P.Nishanth Kumar
సినిమాలలో వచ్చే స్పెషల్ సాంగ్స్ కి ఎంతగా క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తెలుగు సినిమాలలో వచ్చే ఐటెం సాంగ్స్ కి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉంటారు.  సినిమా ఏ హీరోదైనా కూడా ఐటమ్ సాంగ్ ఉంటే తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ ఐటమ్ సాంగ్ ఆదరిస్తూ ఉంటారు. ఆ విధంగా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఆ చిత్రం అంతటి పెద్ద విజయాన్ని అందుకోవడానికి కారణం ఈ ఐటెం సాంగ్ అని చెప్పాలి. సమంత చేసిన ఈ ఐటెం సాంగ్ కు యావత్ దేశం మొత్తం ఊగిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా ఈ సినిమాలోని పాటలకు మిలియన్ న్యూస్ దక్కి దేవిశ్రీప్రసాద్ కు పూర్వ వైభవం దక్కేలా చేసింది అని చెప్పాలి. అయితే ఇప్పటిదాకా వచ్చిన ఐటమ్ పాటల లో కెల్లా ఈ పాటకి ఎక్కువగా క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాల యొక్క ఐటెం సాంగ్స్ ఏ మాత్రం ప్రేక్షకులకు ఎక్కకపోవడంతో ఈ పాటను వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట.

ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కింది. కాబట్టి అక్కడ ఈ పాటకు ఇంతటి స్థాయిలో క్రేజీ రావడం నిజంగా విశేషం అనే చెప్పాలి. అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా యొక్క రెండవ భాగం పై కసరత్తు చేస్తున్నాడు. ఇందులో కూడా ఓ ఐటమ్ సాంగ్ ఉండబోతుంది అని చెబుతున్నారు. ఈ పాటకు కాజల్ డాన్స్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఇప్పుడు బాలీవుడ్ నటీనటులు చాలామంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అర్జున్ కపూర్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించబోతున్నాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: