బెల్లంకొండ గణేష్ సక్సెస్ కొట్టినట్లే.. కానీ!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో వారసుల రాక కొత్తేమీ కాదు. చాలామంది హీరోల వారసులు సినిమా పరిశ్రమ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. ఆ విధంగా ఇటీవల ఓ అగ్ర నిర్మాత వారసులు సినిమాలలోకి వచ్చి తన చిత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమ లో అగ్ర నిర్మాతగా ఉన్నాడు బెల్లంకొండ సురేష్. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలను తెరకెక్కించి సంచలనాత్మక వసూలను సాధించి ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా సెటిల్ అయిపోయాడు.

ఈ నేపథ్యంలోనే తన పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ శ్రీనివాస్ నీ హీరోగా చేసి ఆయనను హీరోగా నిలబెట్టాడు అని చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరశ్రమలో ఆయన సత్తా చాటుకునే విధంగా సిద్ధమవుతున్నాడు. చత్రపతి సినిమా రీమేక్ అక్కడ చేయడం విశేషం ఆ విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సెటిల్ కాగా ఇప్పుడు ఆయన తన రెండవ తనయుడు బెల్లంకొండ గణేష్ ను సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం విశేషం. అంతేకాదు బెల్లంకొండ గణేష్ ఇటీవల స్వాతిముత్యం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

పలు పెద్ద సినిమాలు ఉన్నా కూడా అవేవీ ఖాతరు చేయకుండా బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం సినిమాలో దసరాకు విడుదల చేయడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. ఎంతో ధైర్యం ఉంటే గానీ ఈ విధమైన పని చేయలేడు. అయితే ఈ సినిమాకు మంచి ఫలితమే వచ్చినా కూడా దాన్ని క్యాష్ చేసుకోవడంలో నిర్మాతలు అలసత్వం చూపిస్తున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం పేలవంగానే ఉన్నాయి. చాలామంది ఈ సినిమా విడుదల రాంగ్ టైంలో జరిగిందని చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఈవారం ఈ సినిమాను విడుదల చేసి ఉంటే మంచి గుర్తింపు వచ్చేదేమో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: