ప్రభాస్ కు నోటీసులు.. వివరణ ఇవ్వాల్సిందే....!!
అయితే అక్టోబర్ 2న రిలీజ్ అ యిన టీజ ర్ తో అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి. టీజర్ రిలీజ్ అయ్యిందో లేదో ఆ మూవీ ని వివాదాలు చుట్టూముట్టాయి. టీజర్ యాని మేషన్ మూవీలా ఉందంటూ.. ప్రభాస్ లుక్ అసలు బాగోలే దంటూ అభిమానులు భారీ ఎత్తున నిరాశ చెందారు. అంతే కాకుండా మూవీలోని గ్రాఫి క్స్ కూడా ఫెలవంగా ఉందని చిత్రంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉండగా మూవీ లోని రావణుడి లుక్ రామాయ ణాన్ని వక్రీకరించే విధంగా ఉందని హిందు సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతి రేకత వ్యక్త మైంది. మూవీ రామాయణాన్ని వక్రీకరిస్తే సహించేది లేదని, మూవీ వి డుదలను అడ్డుకుంటామని హిందూ సంఘాలు వార్నింగ్ కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని హిం దూ సంఘాలు హై కోర్టు లో పిటిషన్ కూడా దాఖలు చేశాయి. హిందువుల మనోభావాలు గాయపరిచేలా మూవీ ఉందని, మూవీ విడుదలపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. ఇందుకు సంభందించి వివరణ కోరు తూ హీరో ప్రభాస్ తో చిత్రా యూనిట్ కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. దీంతో ప్ర భాస్ ఈ వివాదంపై ఎలాస్పం దిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న వి డుదల కానుంది. మరి కేవలం టీజర్ తోనే ఈ స్థాయిలో వి వాదాలు చుట్టు ముట్టిన ఆది పు రుష్ మూవీపై.. విడుదల తరువాత ఇంకెలాంటి పరిణా మాలు చోటు చేసుకుం టాయో చూడాలి.