కిరణ్ అబ్బవరం ఓటీటి లోనైనా సక్సెస్ అవుతారా..!!

Divya
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. డైరెక్టర్ శ్రీధర్ గాదే తెరకెక్కించిన ఈ చిత్రం గత నెల 16న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఈ చిత్రం బాగా అలరించింది. కిరణ్ అబ్బవరం సరసన సంజన ఆనంద్ హీరోయిన్గా నటించింది. ఇందులో సోను ఠాగూర్, సిద్ధార్థ మీనన్ ,ఎస్వీ కృష్ణారెడ్డి ,బాబా భాస్కర్, సమీర్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ అందించారు.

ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా అంతగా రాబట్ట లేక పోయింది ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటి లో స్ట్రిమ్మింగ్ కోసం సిద్ధమయింది. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 14 నుంచి ఈ సినిమా స్ట్రిమింగ్ కానున్నట్లు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ఒక కుర్రాడుని ప్రేమించి మోసపోయిన ఒక అమ్మాయి కథ అంశంగా తెరకెక్కించడం జరిగింది. అలా ఆమె జీవితంలోకి ఒక క్యాబ్ డ్రైవర్ గా నటించిన కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది.

అలా వీరిద్దరి మధ్య పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది వీరి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనే విషయమే నేను మీకు బాగా కావలసిన వాడిని చిత్రం. ఈ చిత్రం థియేటర్లో మెప్పించలేకపోయిన మరి ఓటీపీ లోనైనా అలరిస్తారేమో చూడాలి మరి. ఏది ఏమైనా కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రాలు అన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అయినా కూడా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఈ యువ హీరోకి. అయితే ఈ హీరో లాంగ్వేజ్, మాటలు, యాటిట్యూడ్ అన్ని చిత్రాలలో ఒకేలా ఉండడం ఎక్కువగా ఈ హీరో సినిమాలు ఫ్లాప్ గా వస్తున్నాయని కొంతమంది ప్రేక్షకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: