
సమంత లేటెస్ట్ కామెంట్స్ వెనుక ఆంతర్యం !
ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆమె అమెరికా వెళ్ళి అక్కడ చెక్ చేయించుకుందని కొందరు రూమర్స్ పుట్టిస్తే మరికొందరు సమంత మరొకసారి పెళ్ళికి రెడీ అవుతోందని మరొక అడుగు ముందుకు వేసి మరో రూమర్ కు శ్రీకారం చుట్టారు. దీనికితోడుగా సమంత తాను నటిస్తున్న సినిమాల షూటింగ్ లకు కూడ గ్యాప్ తీసుకోవడంతో సమంతకు ఏమైంది అంటూ ఆమె అభిమానులు ఖంగారు పడ్డారు.
ఇక లాభం లేదు అనుకుని ఈ రూమర్స్ కు చెక్ పెట్టడానికి స్వయంగా సమంత రంగంలోకి దిగింది. ‘ఓడిపోలేదు వెనక్కు తగ్గాను అంతే’ అంటూ తన పెట్ డాగ్ బ్యాక్ లుక్ ను షేర్ చేస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో క్షణాలలో వైరల్ కావడమే కాకుండా ఈ ఫోటో సమంత తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి పరోక్షంగా చైతన్యను టార్గెట్ చేసే విధంగా ఉంది అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు.
అయితే సమంత ఇలా గ్యాప్ తీసుకోవడం వెనుక మరొక కారణం ఉంది అని ఊహాగానాలు చేసేవారు కూడ బాగా పెరిగిపోతున్నారు. సమంత ప్రస్తుతం భారీ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కోసం ఆమె ఒక ప్రత్యేక ట్రైనర్ ను పెట్టుకుని చాల ఎక్కువగా శ్రమ పడుతోందని అందువల్లనే సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంది అంటూ మరికొందరి అభిప్రాయం. ఆమె నటించిన ‘యశోధర’ ‘శాకుంతలం’ విడుదలకు రెడీగా ఉన్నప్పటికీ ఆసినిమాల విడుదల విషయంలో రకరకాల కారణాలతో ఆలస్యం జరుగుతూ ఉండటంతో ఆమె అభిమానులు నిరాశ పడుతున్నారు..