వయసు తో పాటు తన అందాన్ని కూడా పెంచుతున్నా స్నేహ..!!

murali krishna
టాప్ బ్యూటీ, సీనియర్ హీరోయిన్ స్నేహా   వయస్సు పెరిగినా కొద్దీ గ్లామర్ కూడా మెరుపులతో మరింతగా అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాలతో పాటు ఇంటర్నెట్ లోనూ ఫొటోషూట్లతో  తెగ సందడి చేస్తోంది.

సీనియర్ హీరోయిన్ స్నేహా గురించి తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మరి, తెలుగు బడా స్టార్స్ సరసన నటించిన ఈ బ్యూటీ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు  బాగ కనెక్ట్ అయ్యింది. పాత్రకు తగ్గట్టుగా నటనపరంగా ఒదిగిపోవడం ఈ బ్యూటీ ప్రత్యేకత.
లక్షలాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న స్నేహ.. ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఆధునిక కాలంలో అభిమానులకు మరింతగా చెరవయ్యేందుకు నెట్టింట దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తూ, ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.
 
తాజాగా స్నేహా పట్టుచీరలో మెరిసింది. అచ్చమైన తెలుగమ్మాయిలా అందాలను ఆరబోసింది. గోల్డ్ కలర్ సిల్క్ శారీలో మెరిసిపోయింది. క్రేజీగా ఫొటోలకు పోజులిస్తూ హోమ్లీ బ్యూటీ తన మార్క్ చూపించింది. మత్తు చూపులు, మతిపోయే పోజులతో కుర్రాళ్లను సైతం తన వైపు ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది స్నేహ
 
వయస్సు పెరుగుతున్నా కొద్దీ స్నేహా మరింత గుడ్ లుకింగ్ తో ఆకట్టుకుంటోంది. నెట్టింట మాత్రం వరుస ఫొటోషూట్లతో సందడి చేస్తూనే ఉంది. హోమ్లీ బ్యూటీ అందాల ప్రదర్శనకు నెటిజన్లను  కూడా ఫిదా అవుతున్నారు. ఆమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
 
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. నార్త్ కు చెందిన సీనియర్ నటి స్నేహా.. సౌత్ లోనే  చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ తన ముద్ర వేసుకుంటోంది.
 
తెలుగులో చివరిగా స్నేహా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన   'వినయ విధేయ రామా'లో నటించింది. చెర్రీకి వదినగా నటించిన స్నేహా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కన్నడ, తమిళ, మళయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఇటు టీవీ షోలతోనూ దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోంది నటి స్నేహ గారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: