టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటు వంటి అక్కినేని నాగార్జున మరియు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున మరియు అక్కినేని అఖిల్ కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ లో ఫుల్ లెన్త్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడబోతున్నట్లు సమాచారం. ఈ వార్త కనుక నిజం అయితే అక్కినేని అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు.
ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయ్యి , ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర విజయ వంతంగా ప్రదర్శించబడుతుంది. అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే మోహన్ రాజా తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ని తెచ్చుకొని అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొడుతుంది.