'గాడ్ ఫాదర్' లో సల్మాన్ ఖాన్ పాత్ర.. ఆ మెగా హీరో చేయాల్సిందట?

praveen
మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరి ఆకలి తీరుస్తూ చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ హీట్ అందుకున్నాడు అని చెప్పాలి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ లూసీఫర్  తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన చిరంజీవి ప్రేక్షకులు అందరిని మెప్పించాడు. తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు కలిసి అటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది. ఇకపోతే సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించి ఇటీవల ఒక వార్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ప్రస్తుతం మెగాస్టార్ పేరును వాడుకొని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇక తమ టాలెంట్ను నిరూపించుకుని తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న మెగా హీరోలు చాలామంది ఉన్నారు. ఇక మెగా హీరోలు ఎంత మంచి హిట్ కొట్టినా కూడా.. తమ ఫ్యామిలీకి మూల స్తంభమైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ ఒక్కసారి వచ్చిన చాలు అని అనుకుంటూ ఉంటారు. ఇక ఒకవేళ ఇలాంటి ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోరు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే ఒక మెగా హీరోకి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర చేయాలని ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారి పోయిందట.


 ఆ మెగా హీరో ఎవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. తనకు ఎప్పటినుంచో తన పెదనాన్న మెగాస్టార్ తో కలిసి నటించాలని ఉంది అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో మనసులో మాట బయటపెట్టాడు వరుణ్ తేజ్. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజానికి సల్మాన్ ఖాన్ పాత్రలో ముందుగా అనుకున్న హీరో వరుణ్ తేజ్ అట. మెగాస్టార్ ఈ రోల్ వినగానే ఎవరైనా మెగా హీరో చేస్తే బాగుంటుందని అనుకున్నారట. అంతలోనే వరుణ్ తేజ్ మనసులో మెదిలాడు. కానీ దర్శకుడు మోహన్ రాజ మాత్రం మెగా హీరో వద్దు అని పట్టుబట్టి మరి బాలీవుడ్ హీరోని పెడదామని ఇక మెగాస్టార్ తో చర్చలు జరిపారట. తద్వారా సల్మాన్ ఖాన్ ను సెలెక్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: