ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కవలసిన సినిమా ఇంకా మొదలు కాకపోవడం నిజంగా ఎన్టీఆర్ అభిమానుల లో ఎంతో అసహనాన్ని కలగజేస్తుంది అని చెప్పాలి. వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయవలసి ఉంది కానీ కథ విషయంలో ఇరువురికి పొత్తు కుదరక పోవడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. లేదంటే ఈపాటికి ఆ సినిమాను పూర్తి చేసి ఉండేవాడు ఎన్టీఆర్.
అయితే కొరటాల శివ సినిమాను ఏ ముహూర్తాన ఒప్పుకున్నాడో తెలియదు కానీ ఆ చిత్రం ఇంకా మొదలు కాకపోవడం నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎంతగానో నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో అన్న క్లారిటీ కూడా లేకపోవడం నిజంగా అందరిని నిరుత్సాహపరిచే విషయం అనే చెప్పాలి. హీరోలందరూ వరుసగా తమ సినిమాలను వరుసగా చేసుకుంటూ పోతుంటే ఈ హీరో మాత్రం ఇంకా సినిమాను మొదలు పెట్టకపోవడం ఆయన కెరీర్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ పై పూర్తిగా నమ్మకం పోవడం ఒకసారిగా ఆయనపై ఇంతటి ఒత్తిడి నెలకొంటుంది అని చెప్పాలి. ఇప్పటిదాకా అపజయం ఎరుగని దర్శకుడుగా ఉన్న కొరటాల శివ ఒకే ఒక్క సినిమా ఫ్లాప్ తో తన ఇమేజ్ను దాదాపుగా కోల్పోయాడని చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాతో మంచి కం బ్యాక్ చేసి మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో కొరటాల శివ ఇంకా ఈ సినిమాను మొదలు పెట్టకపోవడానికి కారణం ఏమై ఉన్నా కూడా అది ఆయనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారు.