ట్రైలర్: కామెడీతో కడుపుబ్బ నవ్విస్తున్న ఓరి దేవుడా..!!

Divya
యువ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన సినిమాలతో ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓరి దేవుడా అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ , ఆశ భట్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రసార కార్యక్రమాలు ఈ సినిమా పైన మరింత ఆసక్తిని కలిగించాయి ఈ నేపథ్యంలోని ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ సినిమా ట్రైలర్ను కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. కోర్టులో అర్జున్ పనుల విడాకుల కేసు వాదనలతో ఈ సినిమా ట్రైలర్ మొదట ప్రారంభమవుతుంది. ఇక ఈ ట్రైలర్లు పూరి జగన్నాథ్ కూడా తన డైలాగులతో బాగా ఆకట్టుకుంటున్నారు. ఇక వెంకటేష్ విశ్వక్ సేన్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని వెంకటేష్ అడగగా లవ్వే లేని లవ్ మ్యారేజ్ అని నవ్వుతూ సమాధానం తెలియజేస్తారు విశ్వక్ సేన్.

ఇక చివరిలో చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ఆడియన్స్ సైతం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నది. భార్య భర్తల మధ్య కలహాలు సంఘర్షణ నేపథ్యంలో ఏర్పడిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ చిత్రాన్ని తమిళంలో విజయం సాధించిన ఓ మై కడవులే అనే చిత్రాన్ని రీమిక్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో డైరెక్టర్ అశ్వత్ మరుమూర్తి దర్శకత్వం వహించారు.పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి డైలాగులను అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ చాలా వైరల్ గా మారుతోంది. ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: