మరొకసారి ఆసక్తికరమైన పోస్ట్ చేసిన దీపికా పడుకొనే..!!

Divya
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో ముద్దుగుమ్మ దీపిక పడుకునే కూడా ఒకరిని చెప్పవచ్చు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అలా స్టార్ డమ్ ఉన్న సమయంలోనే స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రాజెక్టు-k చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది. ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో చాలా శరవేగంగా జరుపుకుంటోంది.

ఇటీవలే వోగ్ అరేబియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ తను డిప్రెషన్ తో పోరాడిన రోజులను మరొకసారి గుర్తుకు చేసుకుంది. ఆమె ముందు తన మనసుకు, శరీరానికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని తెలియజేసింది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం దీపిక పడుకొనే.. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని దీంతో పలుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలియజేసింది.ఆ సమయంలో తన తల్లి తనకు అండగా నిలిచిందని చెప్పుకొస్తుంది. అలా ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది అని తాజాగా మళ్లీ చెప్పుకొస్తుంది.

మానసిక వ్యాధితో బాధపడుతున్న అనుభవమే ఇప్పుడు తనని ఈ స్థాయికి తీసుకువచ్చిందని అందుచేతనే ముందుగా అన్నిటికంటే తనకు తన మనసు, శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొస్తుంది. మనం ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇదే నన్ను విజయవంతంగా నిలబెట్టింది అని దీపికా పడుకొనే తెలిపింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటించిన పటాన్ చిత్రంలో నటిస్తోంది. దీపిక పడుకొని తన ఇంస్టాగ్రామ్ నుంచి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: