వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న మీనా..ఫోటో వైరల్..

Satvika
హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. తెలుగు, తమిళ్ లో కలిసి ఎన్నో సినిమాల లో నటించింది. హీరోయిన్ గా ఆమె చెరగని ముద్ర వేసుకుంది.సౌత్ ఇండస్ట్రీ లో అగ్రతారగా ఎన్నో సినిమాల లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిన్నటి తరం కథానాయకి మీనా గురించి అందరికీ సుపరిచితమే.

హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాల కు కమిట్ అయ్యి ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె జీవితంలో విషాద సంఘటన నెలకొన్న విషయం మనకు తెలిసిందే. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే.

భర్త మరణంతో శోకసంద్రంలోకి వెళ్లిపోయిన మీనాకు అండగా ఎంతోమంది స్నేహితులు ధైర్యం చెబుతూ తనని సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు.తన భర్త మరణించిన తర్వాత తన స్నేహితులు తరచు తన ఇంటికి వెళ్తూ తనతో సమయం గడిపి ఇప్పుడిప్పుడే తనని సాధారణ స్థితికి తీసుకొస్తున్నారు. ఇకపోతే కొద్ది రోజుల క్రితం హీరోయిన్స్ సంఘవి రాధిక రంభ వంటి పలువురు హీరోయిన్లు ఈమె పుట్టినరోజు వేడుకల ను ఎంతో ఘనంగా జరిపించారు.


తన స్నేహితురాలు స్టైలిస్ట్ రేణుక ప్రవీణ్ తో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా భర్త మరణం తర్వాత మొదటిసారి హాలిడే వెకేషన్ వెళ్ళినటువంటి మీనా ఫారిన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే భర్త జ్ఞాపకాల నుంచి బయట పడుతుందని అంటున్నారు..మరి కొంత మంది యిప్పుడు అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి..ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: