తెలుగు బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో గా మంచి ప్రాధాన్యత సంపాదించిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ షో ఎంత సక్సెస్ అయ్యిందో అంతే విమర్శలను మూటగట్టుకుంటుంది. ఇక టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతున్న ఈ గేమ్ షో పై ఇప్పటికే కొంతమంది మండిపడుతున్నారు.ఇకపోతే బిగ్ బాస్ గేమ్ షోలో బోల్డ్ నెస్ ఎక్కువైందంటూ.. కుటుంబంతో కలిసి చూసేలా ఈ ప్రోగ్రాం లేదంటూ విమర్శిస్తున్నారు కొందరు. ఇదిలావుంటే తాజాగా ఈ గేమ్ షో పై కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.అయితే ఇప్పటికే బిగ్ బాస్ గేమ్ షో పై సీపీఐ నారాయణ చాలా సార్లు ఫైర్ అయ్యారు.
ఇక బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ తో పోల్చారు నారాయణ.అయితే సమాజాన్ని చెడగొట్టేలా ఈ గేమ్ షో ఉందంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు నారాయణ.ఇదిలావుంటే తాజాగా ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో ఆపేయాలంటూ పిటిషన్ దాఖలు అయ్యింది. అంతేకాదు బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువయ్యిందంటూ.. అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. షోను వెంటనే ఆపివేయాలంటూ.. ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి.అయితే ఐ.బి.ఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయాన్ని పాటించాలన్న పిటిషనర్.
ఇక రాత్రి 11 నుంచీ తెల్లవారుజామున 5 వరకూ మాత్రమే బిగ్ బాస్ షో నిలిపివేయాలన్నారు. ఈ గేమ్ షో లో అశ్లీలత ఎక్కువగా ఉందని కుటుంబంతో కలిసి చూసేలా లేదని ఆయన ఆరోపించారు. ఇకపోతే ఈ కేసును ఇవాళ హైకోర్టు విచారించనుంది. బిగ్ బాస్ షో పై ధర్మస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఆరో సీజన్ ను రన్ చేస్తోంది. ఇకపోతే.టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షో ఇతర భాషల్లోనూ పాపులర్ అయిన విషయం తెలిసిందే..!!