ఈ హీరోయిన్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం..?

Divya
సురభి ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట తమిళ సినీ పరిశ్రమలో తన కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన బీరువా చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. శర్వానంద్ తో కలిసి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా చిత్రంతో ప్రేక్షకులకు బాగా గుర్తిండి పోయేలా నటించింది. ఈ చిత్రంతో ఈమెకు వరుస ఆఫర్లు వెలుపడ్డాయి కానీ ఈ క్రమంలోనే జెంటిల్ మేన్, ఎటాక్, ఒక్క క్షణం, ఓటర్ తదితర సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోయింది. ఇక తమిళంలో కూడా ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలు చేసినప్పటికీ అక్కడ కూడా అంతగా కలిసి రాలేదు. చివరిగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో శశి అనే చిత్రం లో నటించింది.

అయితే గత ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బారిడి జాతరను చూసింది ఇక సినిమా తర్వాత మరి సినిమాలో నటించలేదు.ఈ ముద్దుగుమ్మ అయితే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా వెలువబడలేదు. అయితే సురభి వచ్చిన అవకాశాలు అన్నిటిని ఒప్పుకుంటూ సినిమా కథల ఎంపిక విషయంలో సరిగ్గా లేకపోవడం వల్ల ఈమెకు ఇలా జరిగిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ స్టార్ హీరోల సినిమాలలో నటించి ఉంటే ఈ ముద్దుగుమ్మ బిజీ హీరోయిన్గా మారేదని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈమె కెరియర్ పూర్తిగా డౌన్ అయిందని చెప్పవచ్చు. మైమరిపించే అందం, నటన ప్రతిభ ఉన్న కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు లేవు.. ఈ క్రమంలోని అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా తన అందాలను ప్రదర్శిస్తూ ఉన్నది. తరచూ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారులకు సైతం నిద్ర లేకుండా చేస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మకు ఈ విధంగానైనా సరే అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: