ఖైదీ 2 గురించి కార్తీ అప్డేట్ ఇచ్చేశాడు..!

shami
కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఖైదీ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మాస్ ఆడియన్స్ ని బీభత్సంగా ఆకట్టుకున్న ఈ సినిమా సీక్వల్ కోసం ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఖైదీ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఖైదీ 2 కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక లేటెస్ట్ గా పొన్నియిన్ సెల్వన్ సినిమా చేసిన కార్తీ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖైదీ 2 గురించి కూడా చెప్పాడు.
లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ ఖైదీ 2 స్క్రిప్ట్ రెడీ చేశాడని. అయితే ఆయన ప్రస్తుతం వేరే సినిమా చేస్తున్నాడని ఆ సినిమా పూర్తి కాగానే 2023 మొదట్లోనే మా సినిమా మొదలవుతుందని అన్నారు కార్తీ. ఖైదీ హిట్ అయ్యింది కాబట్టి సీక్వల్ సినిమాను భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా కమల్ హాసన్ తో విక్రం సినిమా చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెలిసిందే.
విక్రం తర్వాత తన నెక్స్ట్ సినిమా దళపతి విజయ్ తో చేస్తున్నాడు లోకేష్. ఆల్రెడీ విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన లోకేష్ మరోసారి విజయ్ తో మూవీ చేస్తున్నారు. కార్తీ తో ఖైదీ 2 సినిమా తెలుగులో కూడా భారీ రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ సినిమాని తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నాడట లోకేష్ కనగరాజ్. ఖైదీ 2 సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో తనకున్న ఫ్యాన్ ఫాలోయిన్ కి తెలుగులో కూడా స్ట్రైట్ సినిమాలు చేయాలని అనుకుంటున్నారట కార్తీ. అయితే ఈమధ్య సినిమాలన్ని బైలింగ్వల్, పాన్ ఇండియాలు అవుతున్న కారణంగా కార్తీతో ఓ తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేస్తే బెటర్ అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: