ఇంకోసారి మనసున్న మారాజు అనిపించించుకున్న..... 'సోనూసూద్ '.....!!

murali krishna
పంజాబ్‌ చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష‍్టకరమన్నారు. దయచేసి ఎవరూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల‍్లో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.మంచి మనసు గల సోనూసూద్ ఇలా వరి గురించి అలోచించి మొదటగా సోషల్ మీడియా ద్వారా అందరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా బాగుందని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి క‍్లిష్ట సమయంలో మనం వారికి పూర్తి అండగా నిలవాలని సోషల్ మీడియా ద్వారా సోనూ సూద్ కోరారు.

'చండీగఢ్‌ యూనివర్శిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష‍్టకరం. ఈ కష్ట సమయంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విషయంలో మన సిస‍్టర్స్‌కు అండగా నిలుద్దాం. దయచేసి ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు షేర్ చేయొద్దు. ఇది మనందరికీ పరీక్ష సమయం. బాధ్యత గల పౌరులుగా మన బాధితుల తరఫున నిలుద్దాం' అని సోషల్ మీడియా పరంగా సందేశం ఇచ్చారు సోనూసూద్ .

పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సీటీలోని హాస్టల్‌లో దాదాపు 60 మంది యువతుల ప్రైవేటు వీడియోలను వారితో కలిసి ఉండే మరో యువతి తీయడం తెలియకుండానే జరిగింది అది ఇపుడు సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ వీడియోలు ఆ యువతి స‍్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ కావడంతో బాధిత యువతులు ఆందోళనకు దిగారు. కొంతమంది బాధితులు ఆత్మహత‍్యకు కూడా యత్నించారు. అయితే ఈ ఘటనను పోలీసులు, యూనివర్శిటీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా దీని పై ఖండించి దయచేసి మీడియా లో దీన్ని వైరల్ చేయవద్దో అని ఇది ఎలా జరిగిందో కనుక్కొని తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు… తొరగానే విచారణ చర్యలు తీసుకుంటాం అని అన్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: