వైరల్ అవుతున్న హను రాఘవపూడి కామెంట్స్...!!

murali krishna
హను రాఘవపూడి సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ దర్శకుడికి ప్రస్తుతం తెలుగులో మరికొన్ని అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసును ఆకట్టుకుందట..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం కావడంతో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ముందుగా ఈ సినిమాలో నటించే అవకాశం కోసం దర్శకుడు హను రాగవపూడి పలువురు హీరోలను సంప్రదించారని వీళ్ళందరూ కాదంటేనే దుల్కర్ సల్మాన్ కి ఈ అవకాశం వచ్చిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ముందుగా ఈ సినిమా కథతో హనురాగవపూడి హీరో విజయ్ దేవరకొండ, రామ్,నాచురల్ స్టార్ నానిని కలిసారని ఈ ముగ్గురికి కథ వినిపించినప్పటికీ ఈ ముగ్గురు సినిమాని రిజెక్ట్ చేయడం వల్లే దుల్కర్ సల్మాన్ వద్దకు ఈ సినిమా వెళ్లిందని వార్తలు కూడా వచ్చాయి.


  ఈ వార్తలపై డైరెక్టర్ హను రాఘవపూడి స్పందించి అసలు విషయం వెల్లడించారు. నేను ఈ సినిమా కథ వినిపించడం కోసం ఆ ముగ్గురు హీరోలను కలవలేదని ఈయన క్లారిటీ ఇచ్చారు.తాను ఎప్పుడు ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేయనని కథ పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత ఆ సినిమా ఎవరికి సరిపోతుందని తెలుసుకున్న తరువాతే ఆ హీరోలను సంప్రదిస్తానని ఈయన తెలియజేశారట.నానితో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా చేయాలని అతనిని కలిసాను అలాగే రామ్ ను కలిసిన మాట నిజమే కానీ ఈ సినిమా కోసం తనని కలవలేదని అదేవిధంగా విజయ్ దేవరకొండను వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సమయంలో కలిశానని అయితే ఈ సినిమా కోసమే తనని కలవలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ కూడా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: