టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై ఎన్నో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదని మెగా అభిమానులు ఫీలవుతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రోమోకు సంబంధించి నెటిజన్ల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ ఇబ్బందులకు అసలు కారణం వేరే ఉందని సమాచారం.సినిమా రిలీజ్ కు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండగా ఇప్పటివరకు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని సమాచారం అందుతోంది. ఈ రీజన్ వల్లే మేకర్స్ ప్రమోషన్స్ పై సరిగ్గా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాను నిర్మాతలు అడ్వాన్స్ లు తీసుకొని రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. బయ్యర్ల నుంచి ఎలాంటి సమస్య రాకూడదని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తుంది.
గాడ్ ఫాదర్ సినిమా తక్కువ అంచనాలతోనే థియేటర్లలో విడుదలవుతుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మలయాళంలో సక్సెస్ సాధించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ కావడంతో ఈ సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన వాళ్లు కూడా గాడ్ ఫాదర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గాడ్ ఫాదర్ సినిమా హిట్ అనేది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కు కీలకం కాగా ఈ సినిమా విషయంలో చిరంజీవి పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారని తెలుస్తోంది. చిరంజీవి రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించడంతో హిందీలో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం తెలుస్తుంది..