ఆమ్మో... అంత ఖర్చు పెట్టాడా.... రాజమౌళి..??

murali krishna
కరోనా తర్వాత నీరసించిపోయిన ఇండియన్ సినిమా గ్లోరిని తిరిగి తెచ్చిన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్ '. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మాగ్నమ్ ఓపస్‌లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, కోమురం భీమ్‌గా ఎన్టీఆర్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
పెర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ స్క్రిప్ట్, పెర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నాలజీగా పేరు తెచ్చుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ఆస్కార్ బరిలో ఉండబోతోంది అంటూ వెరైటీ మ్యాగజైన్ ప్రిడిక్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్‌కి ఉత్తమ విదేవీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుంది.. అవ్వాలి అంటూ పోస్ట్చే స్తున్నారు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే... ఒకవేళ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయితే క్యాంపైన్, ప్రింట్స్ అండ్ అడ్వర్టైజింగ్ కోసం డీవీవీ దానయ్య ఎంత ఖర్చు చేయాలో తెలుసుకుందాం..
అవును,. ఏదైనా సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయితే... ఆస్కార్ కోసం సెపరేట్ పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్కడి ఫిల్మ్ మేకర్స్‌కి, సెలెక్టివ్ ఆడియన్స్‌ కోసం షో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గతంలో అత్యధిక ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న 'పారసైట్' సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం 5 మిలియన్ డాలర్స్ (అంటే.. దాదాపు రూ.40 కోట్లు) ఖర్చు చేసింది.పి అండ్ ఏ కోసం ఓవరాల్‌గా 17 నుంచి 18 మిలియన్ డాలర్స్‌(అంటే దాదాపు రూ.120కోట్లు)ని స్పెండ్ చేసింది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన 'విసారనై'(2016) సినిమా 89వ అకాడెమీ అవార్డ్స్‌కి ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ అయ్యింది కానీ నామినేట్ అవ్వలేదు. కేవలం సెలెక్ట్ అయిన తర్వాత నామినేట్ అవ్వడానికి అవసరమైన క్యాంపెయిన్ కోసమే... సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టామని వెట్రిమారన్ చాలాసార్లు చెప్పాడు. 'విసారనై' ప్రొడ్యూసర్ అయిన హీరో ధనుష్ ఖర్చు వెనకాడకుండా ప్రమోషన్స్ చేశాడు కానీ సినిమా మాత్రం ఆస్కార్‌ని నామినేట్ అవ్వలేదు. ఒకవేళ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా గనుక ఆస్కార్‌కి నామినేట్ అయితే.. నిర్మాతలు తక్కువలో తక్కువగా రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. తన సినిమా వరల్డ్ ఆడియెన్స్‌ని రీచ్ అవుతుంది అంటే, అది తన నెక్స్ట్ సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్లే రాజమౌళి... 'ఆర్ఆర్ఆర్' సినిమా నామినేట్ అయితే చాలు ఖర్చుకి వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కాగా.. ఓ సినిమా ఆస్కార్స్‌కి నామినేట్ అయితే.. ఎన్ని పాట్లు పడాలో చూపిస్తూ మళయాళీ డైరెక్టర్ సలీమ్ అహ్మద్.. 'అండ్ ది ఆస్కార్ గోస్ టు ' అనే సినిమాని తీశాడు. సినిమా రంగంలోకి అడుగుపెట్టక ముందు ఈ దర్శకుడు ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేశాడు. ఆ తరుణంలో ఆయనకి ఎదురైన కొన్ని సంఘటన ఆధారంగా ఓ కథ రాసుకుని మొదటి సినిమాగా తీశాడు. ఆ సినిమా కథ పేరు 'ఆడమిండె మగన్ అబు (ఆడమ్ కొడుకు అబు)'. హజ్ యాత్రకి వెళ్లాలని తపించిన ఓ పేద అత్తరు సాయిబు కథే ఈ చిత్రం. విడుదలైన తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుని ఎన్నో జాతీయ, స్థానిక అవార్డులు పొందింది. అలాగే.. ఈ సినిమాని ఎన్నో అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించారు. అంతేకాకుండా.. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా ఆస్కార్ గుమ్మం వరకూ వెళ్లింది. అక్కడ ఈ మూవీని ప్రమోషన్ చేయడానికి ఈ దర్శకుడు పడిన పాట్లే ఇతివృతంగా 'అండ్ ది ఆస్కార్ గోస్ టు 'సినిమాని తీశాడు. మిన్నల్ మురళీ చిత్రంతో తెలుగులోనూ పాపులారిటీ సాధించిన టొవినో థామస్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: