తమిళ
ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి శింబు తాజాగా వెందు తనింధతు కాదు అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ కి
గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ తమిళ వర్షన్ నిన్న అనగా
సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల అయ్యింది. ఈ
మూవీ కి
తమిళ వర్షన్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ
మూవీ కి మంచి పాజిటివ్ టాక్ కూడా లభించింది. ఈ
మూవీ తెలుగు వర్షన్ ని ది లైఫ్ ఆఫ్ ముత్తు అనే పేరుతో విడుదల చేయనున్నారు.
ఈ
మూవీ తెలుగు వర్షన్ రేపు అనగా
సెప్టెంబర్ 17 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ది లైఫ్ ఆఫ్ ముత్తు
సినిమా 'ఓ టి టి' హక్కులు ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన
అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నట్లు , థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ
మూవీ ని
అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్
మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వెందు తనింధతు కాదు
మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. మరి ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో రేపు విడుదల కాబోయే ఈ
సినిమా తెలుగు వర్షన్ తెలుగు సినీ ప్రేమికులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఈ
మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.