టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మరింత జోష్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ వాటిని అంతే వేగంగా పూర్తి చేస్తూ బిజీగా వున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ...ఇప్పటి యంగ్ హీరోలకి పోటీగా మారాడు మన టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.ఇక ఇదిలావుంటే ఇక ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్..అంతేకాదు అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి..
ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. కాగా ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కూడా కాబోతుంది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కు రెడీ చేసి భోళా శంకర్ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఇదిలావుంటే ప్రెజెంట్ ఈ రెండు సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. ఇకపోతే ఛలో, భీష్మ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల కు కూడా మెగాస్టార్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే.. డివివి దానయ్య నిర్మిస్తున్నాడు అని కూడా అఫిషియల్ గా ప్రకటించారు..
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.. ఈ సినిమా స్టార్ట్ కూడా కాలేదు.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదని.. ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసినట్టే అని అదే సమయంలో మారుతి తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.ఇక దీంతో వెంకీ కుడుములతో చేసే సినిమా ఆగిపోయినట్టే తెలుస్తుంది.దీంతో పాపం అందుకే ఈ డైరెక్టర్ మళ్ళీ యంగ్ హీరోల వెంట పడుతున్నట్టు టాక్..!!