అల్లు అరవింద్... దిల్ రాజు మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదా..?

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా 'నేనే వస్తున్నా' అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు లో సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ కి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు హక్కులను గీత ఆర్ట్ సంస్థ దక్కించుకుంది.


గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ మూవీ ని తెలుగు లో సెప్టెంబర్ 29 వ తేదీన అల్లు అరవింద్ విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇండియా లోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నామనిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించారు. ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది.


ఈ మూవీ ని సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్తో పాటు తెలుగు , కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. అల్లు అరవింద్ తెలుగు హక్కులు దక్కించుకున్న నేనే వస్తున్నా మూవీ సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల కానుండగా జ్ దిల్ రాజు తెలుగు హక్కులు దక్కించుకున్న పొన్నియన్ సెల్వన్ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోరే జరిగేలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: