ఎమోషనల్ కామెంట్స్ చేసిన సమంత తండ్రి జోసెఫ్....!!!
వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది.
టాలీవుడ్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోవడం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానులకి కూడానా హార్ట్ బ్రేకింగ్ గా మారింది. వీరిద్దరూ విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది. కానీ ఇప్పటికి వీరిద్దరి గురించి అభిమానుల్లో ఏదో రకంగా చర్చ జరుగుతూనే ఉంది. 2017లో వివాహం చేసుకున్న చై సామ్ నాలుగేళ్ళ తర్వాత అంతుచిక్కని కారణాలతో విడిపోయారు.
అయితే నాగ చైతన్య, సమంత మాత్రం వారి వారి ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. కానీ వీరిని విడాకుల ఛాయలు మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు. తరచుగా మీడియా ముందు చైతు, సమంతకి.. వారి కుటుంబ సభ్యులకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎంత సైలెంట్ మైంటైన్ చేస్తున్నా కొన్ని సార్లు స్పందించక తప్పడం లేదు.
నాగార్జున పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'లో నటించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాగార్జునకి నాగ చైతన్య విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది. ఒక జాతీయ మీడియాతో ముచ్చటించిన సందర్భంగా నాగార్జున చైతు, సమంత విడాకుల గురించి ఓపెన్ అయ్యారు.
నాగ చైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కంటే వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఇది అతన్ని భాదించడం లేదా ? అని ప్రశ్నించారు. దీనికి నాగ్ బదులిస్తూ.. ' నాగ చైతన్య సంతోషంగా ఉన్నాడు. నేను అదే చూస్తున్నా. చైతు సంతోషంగా ఉంటే నాకు అది చాలు. నాగ చైతన్యకి జరిగింది ఒక అనుభవం. కానీ అది దురదృష్టకరం. దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. అది జరిగిపోయింది. మా జీవితాల నుంచి వెళ్ళిపోయింది. ఎవరి జీవితంలో అయినా ఇలాంటివి జరిగితే దాని నుంచి బయటపడాలి' అని తెలిపారు.
నాగ చైతన్య, సమంత ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి తెలుసుకుని 2017లో నాగార్జున ఈ జంటకు ఘనంగా వివాహం చేశారు. కానీ అనుకోని విధంగా విభేదాలు తలెత్తడంతో చైతు, సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే విభేదాలు ఎందుకు వచ్చాయనేది పెద్ద మిస్టరీనే.
నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక సమంత యశోద, శాకుంతలం లాంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని పలకరించబోతోంది.
ఇటీవలే సమంత తండ్రి జోసెఫ్ కూడా వీరిద్దరి విడాకుల గురించి సోషల్ మీడియాలో స్పందించారు. వీరిద్దరి పెళ్ళినాటి ఫోటోలు షేర్ చేస్తూ ఇది బాధించే గతంలాగా మిగిలిపోయింది అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.