కోబ్రా మూవీ ఓటీటీ విడుదల అప్పుడేనా...?
ఈ సినిమాలో విక్రమ్ విభిన్న పాత్రలలో నటించినప్పటికీ కూడా ఈయన పాత్రకు ప్రశంసలు దక్కగా సినిమా కి మాత్రం మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పాలి. ఇలా థియేటర్ లో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధంగా ఉందట..
ఇక ఈ సినిమాని థియేటర్లో చూడని ప్రేక్షకులు డిజిటల్ మీడియాలో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ విషయానికి వస్తే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సోనీ లివ్ భారీ ధరలకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని అత్యధిక ధరలకు సొంతం చేసుకున్న సోనీ లివ్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23 లేదా 30 వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
థియేటర్లో ఈ సినిమా నాలుగు వారాలా పాటు ప్రదర్శితమైన అనంతరం ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయనున్నారట.. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువబడినది. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించాడు. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. థియేటర్లో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఏ విధమైనటువంటి ఆదరణ సంపాదించుకుంటుందో వేచి చూడాలి మరి… ఇప్పటికే వరుస సినిమాలతో వస్తున్న విక్రమ్ కు కోబ్రా సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చించింది. మరి త్వరలో రాబోయే సినిమా అయిన పొన్నియం సెల్వం ఏ విధంగా అలరిస్తుందో చూడాలి మరి.విక్రమ్ ఈ సినిమాలో ఆకట్టుకునే పాత్రను పోషించాడు.