కోలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న
హీరో లలో ఒకరు అయినటు వంటి శింబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శింబు ఇప్పటికే తాను నటించిన అనేక
మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే శింబు కొన్ని తెలుగు సినిమాలకు పాటలను కూడా పాడాడు. కొంత కాలం క్రితం శింబు ,
మంచు మనోజ్ హీరో గా తెరకెక్కిన పోటుగాడు
మూవీ లో ఒక సాంగ్ ని పాడాడు.
అలాగే తాజాగా
రామ్ పోతినేని హీరో గా తెరకెక్కిన ది
వారియర్ మూవీ లో కూడా శింబు ఒక పాట ను పాడాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శింబు 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే
మూవీ లో హీరోగా నటించాడు? ఈ
మూవీ కి
గౌతమ్ వాసుదేవ్
మీనన్ దర్శకత్వం వహించగా , ఏ ఆర్ రెహమాన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ
మూవీ ని
సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఎలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
సినిమా సెన్సార్ కార్యక్రమాలను ఈ చిత్ర బృందం ముగించినట్లు తెలుస్తోంది.
సెన్సార్ బోర్డు నుండి ది లైఫ్ ఆ ముత్తు
మూవీ కి యూ / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ రన్ టైమ్ ని కూడా
మూవీ యూనిట్ లాక్ చేసినట్లు సమాచారం. ఈ
మూవీ 2 గంటల 53 నిమిషాల 38 సెకండ్ ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మానాడు
మూవీ సక్సెస్ తో మంచి
జోష్ లో ఉన్న శింబు ఈ
మూవీ తో ఏరేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.