వరుస సినిమాలతో దూసుకెళ్తున్న వరలక్ష్మి...!!
ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న 'చేజింగ్' చిత్రాన్ని.. 'ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం' వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఏఎన్ బాలాజీ శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై.. అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది. కె. వీరకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. మదిలగన్ మునియాండి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్లో ఈ సినిమా ఎలాగైతే విజయం సాధించిందో.. తెలుగులో కూడా ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇందులో వరలక్ష్మీ పోలీసాఫీసర్ గెటప్‌లో కనిపించనుంది. ఈ సినిమా టాలీవుడ్లో మంచి సక్సెస్ అయితే మాత్రం.. ఆమెతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడటం కాయం.వరలక్ష్మి వరుసగా తన పాత్రకు ప్రాధాన్యత వున్న పాత్రలనే ఎంచుకొని అద్భుతమైన నటనతో అందరిని అలరిస్తుంది.