అసలు జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముంది...??

frame అసలు జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముంది...??

murali krishna
సీనియర్ ఎన్టీఆర్ మనవడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో తారక్ యాక్టివ్ గానే ఉన్నారు అయినా తన తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు ఎన్టీఆర్ .

కనీసం ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి క్లారిటీ వచ్చినా బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సినిమా మేకర్స్ అంతా సైలెంట్ గానే ఉంటున్నారు .

మరో ఆరు నెలలు ఆగితే తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలు కానుందని తెలుసు . ఈ గ్యాప్ లో తారక్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ ను పూర్తి చేయడం అంత తేలికైన విషయం కాదు. తక్కువ సమయంలో షూటింగ్ పూర్తయ్యేలా చేస్తే కొన్నిసార్లు సినిమా రిజల్ట్ పై కచ్చితం గా ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరి తారక్ మనస్సు లో ఏం ఉందో తారక్ రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో వేచి చూడాల్సి ఉంది.

తారక్ బుచ్చిబాబు కాంబో సినిమాపై రోజురోజుకు కన్ఫ్యూజన్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అటు బుచ్చిబాబు నుంచి లేదా ఇటు తారక్ నుంచి ఎలాంటి స్పష్టత లేదనే సంగతి తెలిసిందే.

 మొత్తాని కి తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ గందరగోళానికి తెర దించగలరని చెప్పవచ్చు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక్క సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా తారక్ కెరీర్ మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ పరంగా తారక్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాల ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: