తాజాగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు మరణంతో యావత్తు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు.కాగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక సోమవారం ప్రభుత్వం లాంఛనాలతో మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.అయితే కృష్ణంరాజు మరణవార్త తెలియగానే చిరంజీవి హుటాహుటిన కృష్ణంరాజు పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ఇక సోమవారం 'మెగా 154' షూటింగ్‌లో లొకేషన్‌లో కృష్ణంరాజు ఫొటో ఏర్పాటు చేసి తన టీమ్ అందరితో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు.
కాగా ప్రకాశ్‌రాజు, దర్శకుడు బాబీ, ఫైటర్స్ ఇతర యూనిట్ సభ్యులు నివాళులు అర్పించారు.ఇక ఇదిలా ఉండగా వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV) చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యాలు చేశారు.అయితే కృష్టంరాజు లాంటి దిగ్గజ హీరో మరణిస్తే నివాళిగా షూటింగ్‌లను నిలిపివేయకుండా ఎవరి పని వారు చేసుకుంటున్నారని సోషల్ మీడియా వేడికగా కౌంటర్ ఇచ్చారు వర్మ. 'భక్త కన్నప్ప, 'కటకటాల రుద్రయ్య', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'తాండ్ర పాపారాయుడు' వంటి అద్భుతమైన చిత్రాలను అందించిన గొప్ప నటుడు, నిర్మాత మరణిస్తే.. ఆయన కోసం ఒక్క రోజు కూడా షూటింగ్‌ను ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు.
అంతేకాదు మనసు లేకపోయినా సరే.. కనీసం మన చావుకైనా విలువ ఉండాలంటే కృష్ణంరాజు లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం.మనది డబ్బు ఎక్కువ ఖర్చవుతోందని నెల రోజులు షూటింగ్‌లు ఆపేసిన పరిశ్రమ మనది.ఇక గొప్ప నటుడు, నిర్మాత కోసం కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపడం తప్పేమీ కాదు'' అంటూ వరుస సోషల్ మీడియా వేదికగా చెప్పారు..ఇదిలావుంటే ఇక వర్మ చేసిన ఈ పోస్ట్ లకు స్పందించి కొందరు తమ సినిమా షూటింగ్‌లలో కృష్ణంరాజుకు నివాళులు అర్పించారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయంలో కొందరు వర్మకు మద్దతు పలుకుతూ ఉంటే... కొందరు నెటిజన్లు మాత్రం వర్మపై మండిపడుతున్నారు..!!