మెగా హీరోల మ్యానియా పై సందేహాలు !
ఒకప్పుడు చిరంజీవి సినిమా విడుదలైనప్పుడు ఆసినిమా టాక్ తో సంబంధం లేకుండా కనీసం ఒక వారం రోజులు ఆసినిమా టిక్కెట్లు దొరకని పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మెగా హీరోల సినిమాల విషయంలో కనిపించడం లేదు అన్నకామెంట్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం మెగా హీరోలకు ఏమాత్రం కలిసిరాలేదు.
భారీ మ్యానియాతో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ 100 కోట్ల సినిమాగా మారలేక పోయింది. ఆతరువాత అత్యంత భారీ అంచనాలతో విడలైన ‘ఆచార్య’ మూవీలో చరణ్ చిరంజీవి లు కలిసి నటించినా ఆ మూవీ పై మెగా అభిమానులు కూడ పెదవి విరచడంతో ఆమూవీ భారీ ఫ్లాప్ గా మారింది.
ఇక వరుణ్ తేజ్ నటించిన ‘గని’ భారీ ఫ్లాప్ గా మారితే సమ్మర్ లో వచ్చిన ‘ఎఫ్ 3’ ఊహించిన స్థాయిలో విజయవంతం కాలేదు. లేటెస్ట్ గా విడుదలైన వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ భారీ ఫ్లాప్ గా మారడంతో ఈ మెగా మేనల్లుడి మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఒక విధంగా ఆలోచిస్తే ఈ సంవత్సరం చిరంజీవి నుండి ప్రతి మెగా హీరోకు పెద్దగా కలిసిరాని సంవత్సరంగా మారిపోయింది.
ఏకంగా చిరంజీవి ‘ఆచార్య’ సూపర్ ఫ్లాప్ ను తట్టుకోలేక ఆ ఫెయిల్యూర్ ను మరెవ్వరి పైనో వేయడానికి ఓపెన్ గానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈవిషయాలు అన్నీ నిశితంగా పరిశీలిస్తే మెగా హీరోల మ్యానియా సగటు ప్రేక్షకులలో తగ్గిందా అన్న సందేహాలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ హిట్ అయినప్పటికీ ఆ హిట్ రాజమౌళి జూనియర్ చరణ్ ల సమిష్టి కృషి కాబట్టి అది మెగా హీరోల ఖాతలలోకి వెళ్ళదు. దీనితో దసరా కు రిలీజ్ అవుతున్న ‘గాడ్ ఫాదర్’ పైనే మెగా హీరోల భవితవ్యం ఆధారపడింది అంటూ కొందరి అభిప్రాయం. దీనితో ‘గాడ్ ఫాదర్’ సక్సస్ అత్యంత కీలకంగా మెగా హీరోలకు మారింది అనుకోవాలి..