పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ
మూవీ షూటింగ్ కొన్ని సార్లు వాయిదా పడడంతో ఇప్పటి వరకు కూడా ఈ
మూవీ షూటింగ్ పూర్తి కాలేదు.
ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత క్రిష్ జాగర్లమూడి 'కొండ పొలం' సినిమాను తెరకెక్కించడం , అలాగే పవన్
కళ్యాణ్ కూడా భీమ్లా
నాయక్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో హరిహర వీరమల్లు
మూవీ షూటింగ్ కొంత కాలం ఆగి పోయింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ
సినిమా షూటింగ్ కొంత కాలం షూటింగ్ జరిగిన తర్వాత మళ్లీ ఆగి పోయింది. ఇది ఇలా ఉంటే తిరిగి ఈ
మూవీ షూటింగ్
అక్టోబర్ 17 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే పవన్
కళ్యాణ్ కేవలం హరిహర వీరమల్లు
మూవీ షూటింగ్ పైనే పూర్తి ఇంట్రెస్ట్ పెట్టి ఈ
సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్
కళ్యాణ్ పుట్టిన రోజు అయిన
సెప్టెంబర్ 2 వ తేదీన హరిహర వీరమల్లు
మూవీ నుండి చిత్ర బృందం పవర్ గ్లాన్స్ పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ప్రేక్షకుల్లో ఈ
మూవీ పై ఉన్న అంచనాలను కూడా ఈ వీడియో ద్వారా పెరిగి పోయాయి. ఈ
మూవీ లో
నిధి అగర్వాల్ పవన్
కళ్యాణ్ సరసన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం
కీరవాణి ఈ
మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.