నయనతార పెళ్లికి ముందు ఒకలా.. పెళ్లి తర్వాత ఒకలా ప్రవర్తిస్తూ ఉండడం కోలీవుడ్ వర్గాలలో ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానికి కారణం ఆమె తాను నటిస్తున్న సినిమాల యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడమే. పెళ్లి కంటే ముందు ఆమె నటించిన సినిమాల తాలూకు ప్రమోషన్ కార్యక్రమాలలో పెద్దగా హాజరయ్యేది కాదు కానీ ఇటీవల కాలంలో ఆమె ఆ విధంగా అడుగులు వేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
కోలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు దక్షిణాదిలోనే ఈమెకు భారీ స్థాయిలో హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉంది. ఆమె సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఒక పెద్ద హీరోకి ఉండాల్సిన మార్కెట్ కలిగి ఉన్న నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా మంచి కలె క్షలను అందుకుంటూ ఉంటాయి. ఆ విధంగా నయనతార వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా తన స్టార్ డం ను కొనసాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళుతుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలలో నటించగా ఆ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో ఈమె పాల్గొనడానికి ఆసక్తి చూపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నయనతారలో పెళ్లి తర్వాత ఇంతటి మార్పు రావడానికి కారణం ఏంటి అని వారు ఆరా తీస్తున్నారు. ఇటీవల ఆమె వివాహం చేసుకొని సంసార జీవితంలోకి అడుగుపెట్టగా నయనతార సినిమాలను ఆపకుండా చేస్తూ ఉండడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. బాలీవుడ్ కూడా చిత్ర పరిశ్రమలో షారుక్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈమె తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సిని మాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. మరి ఈ సినిమాలు ఆమెకు ఏ స్థాయి గుర్తింపు ను తీసుకోస్తాడో చూడాలి.