నాగచైతన్య పై సమంత తండ్రి ప్రశంసలు !

Seetha Sailaja
నాగచైతన్య సమంత లు విడిపోయి మరో రెండు నెలలలో సంవత్సర కాలం అవుతోంది. వాస్తవానికి కొన్ని అభిప్రాయబేధాలతో వీరిద్దరూ విడిపోయారు అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ వీరిద్దరూ విడిపోవడం పై అనేక ఊహాగానాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.


అయితే నాగచైతన్య మాత్రం తాను ఆ సంఘటనలు మరచిపోవాలని ప్రయత్నిస్తున్నానని అంటూ మంచి కథ దొరికితే తాను ఇప్పటికీ సమంతతో నటించడానికి రెడీ అని ఒక ఇంటర్వ్యూలో చెపితే నాగార్జున సమంత తనకు ఎప్పటికీ స్వీట్ గర్ల్ అంటూ ఆమెతో తన కుటుంబం గడిపిన రోజులు తాను మర్చిపోలేను అని అన్నాడు. ఇప్పుడు సమంత తండ్రి జోసఫ్ ప్రభు సమంత చైతన్యల విడాకుల పై స్పందిస్తూ చైతన్య పై ఎవరు ఊహించని విధంగా ప్రశంసలు కురిపించాడు.


‘సమంత నాగ చైతన్య విడిపోయారని తెలిసినప్పటి నుంచి నా మైండ్ బ్లాంక్ అయింది. పరిస్థితులు చక్కబడతాయని ఆశించాను. అయితే వారిద్దరూ విడిపోవడం నాకు ఇప్పటికీ షాక్. నాగచైతన్య తో గడిపిన సమయాన్ని నా కుటుంబం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది' అంటూ జోసెఫ్ చైతన్య పై ప్రశంసలు కురిపించాడు. ఒకవైపు సమంత ఓపెన్ గా చైతన్యా తాను ఒక రూమ్ లో కలిసి ఉంటే ఒకరిని ఒకరు రక్కుకునే పదునైన వస్తువులు తమ రూమ్ లో ఉండాలి అంటూ కామెంట్ చేసిన సందర్భంలో సమంత తండ్రి మాత్రం ఈవిధంగా స్పందించడం ఒక విధంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.


జోసఫ్ కామెంట్స్ ను బట్టి అతడు చైతన్యను ఎంతగా అభిమానించాడో తెలుస్తున్నప్పటికీ వారిద్దరినీ జోసఫ్ విడాకుల వరకు వెళ్ళకుండా ఎందుకు ఆపలేకపోయాడు అన్నది అర్థంకాని విషయం. విడాకుల తరువాత సమంత ‘పుష్ప’ ఐటమ్ సాంగ్ లో రెచ్చిపోతే చైతన్య నటించిన ‘థాంక్యూ’ ‘లాల్ సింగ్ చడ్డా’ వరస పరాజయం చెందడంతో ఒకవిధంగా చైతూ కెరియర్ మళ్ళీ సమస్యలలో పడిందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: