సమంత అనారోగ్యంపై క్లారిటీ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత 'ఏం మాయ చేసావే' మూవీతో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో సమంత తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను కట్టి పాడేయడంతో ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వరస పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాయి.


అలాగే సమంత నటించిన మూవీ లు కూడా బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ శాతం మంచి విజయాలు సాధించడంతో అతి తక్కువ కాలంలోనే సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్నానానికి చేరిపోయింది. సమంత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా అనేక మూవీలలో హీరోయిన్ గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత కమర్షియల్ మూవీ లతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటించడానికి ప్రాముఖ్యతను ఇస్తూ వస్తుంది. సమంత తాజాగా శాకుంతలం మరియు యశోద మూవీ లలో నటించింది.


ఈ రెండు మూవీ లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుంది. దీనితో సమంత కు ఆరోగ్యం బాగోలేదు అని , చర్మ సంబంధ సమస్యతో సమంత బయటికి రావడం లేదు అని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. దీనిపై తాజాగా సమంత మేనేజర్ స్పందించాడు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని , కొంత మంది కావాలనే అలా తప్పుడు వార్తలు రాస్తున్నారని వారిపై సమంత లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పు కొచ్చాడు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉంది అని , ఈనెల ఆఖరి నుండి సమంత షూటింగ్ లో కూడా పాల్గొనబోతుంది అని చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: