కారు దిగగానే సల్మాన్ ఖాన్ చేసిన పనికి.. షాక్ అవుతున్న నెటిజన్స్?
ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ చేసిన పని నవ్వులు పూయిస్తుంది. ఇటీవలే ఒక పార్టీకి హాజరైన సల్మాన్ ఖాన్ కారు దిగిన వెంటనే తన చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ ను పక్కన ఎక్కడైనా పెట్టుకోకుండా ఏకంగా తన ప్యాంట్ పాకెట్ లోనే పెట్టుకున్నాడు. ఈ వీడియో కాస్త ట్విట్టర్ లో చక్కర్లు కొడుతూ ఉండడంతో ఇది చూసి ఎంతో మంది షాక్ అవుతున్నారు అని చెప్పాలి. సినీ నిర్మాత అయిన మురాద్ ఖేతాని పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇటీవలే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడు.
అయితే బర్త్డే సెలబ్రేషన్ సమయంలో కారులో గ్లాసులో ఏదో లిక్విడ్ తాగుతూ కనిపించాడు సల్మాన్ఖాన్. ఆ తర్వాత కార్ నుంచి బయటకు దిగిన తర్వాత తన చేతిలో ఉన్న గ్లాసు పాకెట్లో పెట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. సల్మాన్ భాయ్ కొత్త స్టైల్ అనుకుంటా.. ఇక అక్కడ పార్టీ మొత్తం అదే గ్లాస్ తో ఎంజాయ్ చేయాలని అనుకున్నాడో ఏమో అందుకే గ్లాస్ పాకెట్ లో పెట్టుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. కాగా గతంలో కూడా బిగ్ బాస్ వేదిక పైన వాటర్ తాగిన గ్లాస్ తన పాకెట్ లో పెట్టుకున్నాడు సల్మాన్ ఖాన్ .