కృష్ణ ఆ సినిమాతో సరికొత్త రికార్డ్..!!

Divya
సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం సినిమా తెలుగు సినీ చరిత్రలోనే అత్యధికంగా ప్రాముఖ్యత ఉన్న చిత్రంగా పేరుపొందింది. తెలుగులో మొదటిసారిగా 70 MM సినిమాగా ఈ సినిమా నిలిచింది. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా స్టార్ కాస్ట్యూమ్స్ పరంగా సింహాసనం సినిమా ఒక అద్భుతం అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అందుచేతన ఇప్పటికీ సింహాసనం సినిమా గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు సినీ ప్రేక్షకులు. అలాంటి సింహాసనం సినిమాకు మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా పలు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు పలు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో ప్రదర్శిస్తే జనాలు ఎలా స్పందిస్తారు తెలియక ఈ సినిమా అద్భుతమైన టెక్నాలజీతో సరికొత్త సినిమాలను తీసుకోకుండా ఉండేలా మార్చుతున్నట్లు సమాచారం. ఏకంగా సింహాసనం సినిమాను 8K రీజల్యూషన్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించి పనులు కూడా మొదలైనట్లుగా సమాచారం. ఇక సినిమా క్వాలిటీనే కాకుండా సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


ఈ మధ్యకాలంలో పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం మనం తరచూ చూస్తూనే ఉన్నాము అలా పోకిరి, జల్సా, ఘరానా మొగుడు తదితర సినిమాలు కూడా విడుదలయ్యాయి ఈ సినిమాలు అన్ని కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకున్నాయి. అందుచేతనే కృష్ణ నటించిన సింహాసనం సినిమా 1980లో విడుదలైంది. ఈ సినిమాకి ఖర్చు ఎంత పర్వాలేదని 8k రిజల్యూషన్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి ఎలాగైనా తీసుకురావాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఫిలిం మేకర్స్. అయితే ఈ సినిమా రీ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో కృష్ణకు జోడిగా జయప్రద, రాధా, మందాకిని వంటి వారు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: