బాలీవుడ్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన 'బ్రహ్మాస్త్ర' సినిమాని ని పాన్ ఇండియా వైడ్.. గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. నాగార్జున ఉన్నాడు కాబట్టి, రాజమౌళి సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు, కాబట్టి తెలుగులో కూడా ఈ మూవీని అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.ఇక అందుకోసం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను శనివారం నాడు సాయంత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రామోజీ ఫిలిం సిటీలో చాలా గ్రాండ్ గా నిర్వహించాలి అని ప్లాన్ చేశారు.అయితే సరిగ్గా నాలుగు గంటలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని చెప్పడంతో చిత్ర బృందం పెద్ద షాక్ కు గురైంది. వినాయక చవితి వేడుకలు బందోబస్తు అలాగే గతంలో 'సాహో' సినిమా ఈవెంట్ టైంలో జరిగిన రచ్చ వంటి కారణాలు చెప్పి ఈవెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశారు పోలీసులు. దీని వెనుక కేసీఆర్ కూడా కుట్ర ఉందని.. ఇటీవల ఎన్టీఆర్- అమిత్ షా ల మీటింగ్ కారణంగానే ఈ ఈవెంట్ కు అనుమతులు నిరాకరించారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఏకంగా రూ.2.25 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రచారం జరుగుతుంది. ఒక ఈవెంట్ క్యాన్సిల్ అయితే నిజంగా అంత నష్టం ఉంటుందా? అనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి. నిజానికి ఓ పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎక్కువగా అయితే రూ.75 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఖర్చు అవుతుంది. బాలీవుడ్ నుండి చిత్ర బృందం మరియు అక్కడి మీడియాని తీసుకు రావాలి కాబట్టి అందుకు ఇంకో రూ.50 లక్షలు అదనంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాపై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు. 400 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి లాభాలు తెస్తేనే నిర్మాత కరణ్ జోహార్ సేఫ్ అవుతాడు.కానీ ఈ సినిమాని బాయ్ కాట్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ నడుస్తుంది.