నాగార్జున వల్లే నా కెరీర్ ఇలా.. సుమంత్ షాకింగ్ కామెంట్స్ ?
ఎంత బ్యాక్ గ్రౌండ్ ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం అదృష్టం కూడా కలిసి రావాలి కదా ఆ అదృష్టం కలిసి రాని వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో సుమంత్ కూడా ఒకరు.. అక్కినేని నాగేశ్వరావు మనవడిగా కింగ్ నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుమంత్. ఇక సుమంత్ తండ్రి కూడా ఒక స్టార్ ప్రొడ్యూసర్ కావడం గమనార్హం.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సుమంత్. స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ స్టార్ హీరో రేంజ్ మాత్రం దక్కించుకోలేక ఇప్పుడు వేరే హీరోల సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఒక సినిమాలో క్లైమాక్స్ మార్చమని చెబితే ఆయన వినలేదు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతేకాకుండా తన తాత అక్కినేని నాగేశ్వర రావు మామ నాగార్జునతో కలిసి సినిమాలు చేసి కెరీర్ నాశనం చేసుకున్నాను అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన. నాగార్జునతో కలిసి స్నేహమంటే ఇదేరా సినిమాలో నటించారు. కాగా వీరిద్దరు ఫ్రెండ్స్ కావడం అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఏఎన్నార్ తో కలిసి పెళ్లి సంబంధం సినిమా తీస్తే అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.