హీరోయిన్ శ్రియ కూతురు ఎలా ఉందో తెలుసా..!!

Divya
హీరోయిన్ శ్రియ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఉండే ఈమె ఈమధ్య కాలంలో ట్రెండ్ కు తగ్గట్టుగా మారిపోయింది. ఇటీవల కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఒక గెస్ట్ రోల్ లో నటించింది. ఇక తెలుగుతో పాటు తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా నటిస్తూ ఉన్నది.. ఇక వివాహమై పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ నటిస్తూనే ఉండడం గమనార్హం. కరోనా సమయంలో తాను గర్భవతి అయ్యానని డెలివరీ అయిన తర్వాత తన కూతురిని తీసుకువచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

అయితే తాజాగా మరొకసారి తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఒకవైపు అందాల ఆరబోత ఫోటోలు మరొకవైపు తన కూతురుతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ బాగా పాపులర్ అవుతోంది శ్రియ. తాజాగా శ్రియ తన కూతురు ఫోటోలను షేర్ చేయడంతో ఆమె అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఎంతో చిన్నగా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఒకేసారి ఇంత పెద్దది అయ్యిందా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక శ్రీయ కూతురు తన తల్లిలాగే చాలా అందంగా ఉందని మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు.
ఎట్టకేలకు శ్రియ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ప్రతి ఫోటోలో కూడా తన కూతురి ఫొటో పోస్ట్ చేస్తూ నేటిజెన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో 3.5 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నది ఇప్పటికి తెలుగులో మరియు ఇతర భాషలలో సినిమాలలో నటిస్తే చాలా బిజీగా ఉన్నది శ్రియ. ఇక శ్రీయ కూతురు పేరు కూడా రాధా. ప్రస్తుతం శ్రియ కూతురుకి సంబంధించి ఫోటోలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: