బాలీవుడ్ లవ్బర్డ్స్
కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ తమ
ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ గతేడాది డిసెంబర్‌లో గ్రాండ్‌గా పెళ్లిపీటలెక్కారు.ఇకపోతే రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.కాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు వీరి పెళ్లికి హాజరయ్యారు. తన మెడలో మూడుముళ్లు పడేవరకు
పెళ్లి విషయాన్ని గోప్యంగానే ఉంచింది కత్రినా. ఇక విక్కీ కూడా ఎక్కడా తన
పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే పెళ్లి తంతు పూర్తయిన తర్వాతే సోషల్ మీడియాలో
పెళ్లి ఫొటోలను ఈ జంట షేర్ చేసింది.
కాగా అధికారికంగా విక్కీతో ఏడడుగులు నడిచానంటూ అభిమానులకు తెలిపింది.ఇదిలావుంటే ఇక తాజాగా ఇలా రహస్యంగా తమ
పెళ్లి జరగడానికి గల కారణాన్ని బయటపెట్టింది కత్రినా. అయితే ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి
భర్త విక్కీ కౌశల్‌తో కలిసి
కత్రినా హాజరైంది. కాగా సర్ధార్ ఉదమ్ సింగ్ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడు (క్రిటిక్స్) విభాగంలో అవార్డు అందుకున్నాడు విక్కీ . ఇకపోతే ఈ సందర్భంగా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తన
పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.అయితే “మేము మా పెళ్లిని గోప్యంగా ఉంచడానికి ప్రధాన కారణం కొవిడ్.
ఇక అప్పటి పరిస్థితుల వల్ల అలా రహస్యంగా పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో నా కుటుంబ సభ్యుల్లో చాలామంది కరనా వల్ల ఇబ్బంది పడ్డారు. అంతేకాదు అలాంటిది మా వల్ల మరొకరికి ఈ మహమ్మారి సోకకూడదనే ఉద్దేశంతోనే సీక్రెట్‌గా
పెళ్లి చేసుకున్నాం. మా వివాహం మాత్రం చాలా గ్రాండ్‌గా, అందంగా జరిగిందని భావిస్తున్నాను. అంతేకాదు మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఫీలయ్యాం” అని చెప్పుకోచ్చింది కత్రినా. ఈమె సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ 3 సినిమాలో నటిస్తోంది కత్రినా. ఇక అలాగే సిద్ధాంత్ చతుర్వేది,
ఇషాన్ ఖట్టర్‌తో కలిసి
ఫోన్ భూత్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది..!!