మహేష్ బాబు 28వ మూవీ ఫస్ట్ షెడ్యూల్లో ఆ సన్నివేశాల చిత్రీకరణ..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరక్కబోయే మూవీ లో హీరోగా నటించడానికి రెడీ గా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ రెండవ వారం నుండి మొదలు కానున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు.


హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నాడు. ఈ మూవీ ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించ బోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికి షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మూవీ ఫస్ట్ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనున్నట్లు ,   ఆ షెడ్యూల్లో భారీ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన వెంటనే అతి తక్కువ రోజుల్లోనే రెండవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇది వరకు అతడు , ఖలేజా రెండు మూవీ లు తెర కెక్కాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో హైడ్రిక్ మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: