బెల్లంకొండ చూపు ఆ దర్శకుడిపై పడిందా!!

P.Nishanth Kumar
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమా రీమేక్ సినిమా ను బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ కథనాయక తారా సుతారియా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

మళ్లీ అలాంటి సూపర్ హిట్ సినిమాతో బాలీవుడ్ లో పాత పాతుకు పోవాలని భావిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ హీరో ఇప్పటివరకు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటించిన సినిమాలతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా మంచి ఫలితాలు రాబట్టాడు. అక్కడ ఆయన సినిమాలు డబ్ కాగా వాటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయన డైరెక్టుగా హిందీలో సినిమా చేయాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను అక్కడ వేరే స్థాయిలో రూపొందిస్తున్నాడు ఈ హీరో.

తాజాగా ఈ హీరో తెలుగులో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత ఆయన తెలుగులో సినిమాను ఇంతటి వరకు మొదలు పెట్టలేక పోయాడు. ఇప్పటి దాకా తన పూర్తి దృష్టి మొత్తం కూడా ఈ హిందీ సినిమా పైనే పెట్టాడు. కాగా తాజాగా ఆయన తెలుగులో మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా భీమ్లా నాయక సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సాగర్ చంద్ర తో కలిసి ఈ హీరో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. తొందరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ హీరో టాలీవుడ్, బాలీవుడ్ లలో రావాల్సిన విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: