టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి తన యాక్టింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఆ మూవీలో ఒక అల్లరి కుర్రాడిలా కనిపించిన నిఖిల్ ఆ తర్వాత విజయాలు, అపజయాలు చూసి కొంతకాలంగా కొత్త కధల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ హిట్ మీద హిట్ కొట్టుకుంటూ టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటి హీరోగా దూసుకు పోతున్నాడు. అయితే హిట్లు కొడుతున్న నిఖిల్ రేంజ్ కేవలం 15 కోట్ల మార్కెట్ లోపే. కానీ ఇప్పుడు ఏకంగా 100 కోట్లు మార్కెట్ హీరోగా కూడా పేరు సంపాదించాడు.ఇక ఇటీవల విడుదలైన నిఖిల్ కార్తికేయ2 కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. కేవలం ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది.
ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక హిందీ బెల్టులో కార్తికేయ 2 సినిమాకి ఇప్పటివరకు దాదాపు 20 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.దీంతో ఈ సినిమా బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సౌత్ సినిమాల్లో నిలిచింది అని సమాచారం. చిన్న సినిమాగా రిలీజ్ అయి విడుదలై రెండు వారాలు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ అవుతుంది అంటే సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో అర్ధమవుతుంది. అసలు బాలీవుడ్ లో ప్రేక్షకులు థియేటర్ లకి రాని సమయంలో నిఖిల్ కార్తికేయ 2 ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడమే కాక అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సౌత్ సినిమాల లిస్ట్ లోకి వచ్చిందంటే ఇది భారీ విజయమే.