జెర్సీ.. సినిమా ఎఫెక్ట్ తో మెగా హీరో నిర్ణయం మార్చుకున్నాడా..!!
ఇక అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి కూడా మరికొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సమయంలోనే జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మరొక హీరో కోసం చూస్తున్నారని ఇటీవల యువ హీరోకి కథ కూడా వినిపించారని.. అనే వార్తలు వినిపించాయి. అయితే చరణ్ తో సినిమా కమిట్ అయిన తర్వాత మరొక హీరోకు కథ చెప్పడం ఏంటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో జెర్సీ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని వార్తలు కూడా వినిపించాయి.
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సినిమా చేయడం వల్ల.. మార్కెట్ ఉండకపోవచ్చు అని రామ్ చరణ్ భావించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాని హోల్డ్ లో పెట్టారని వార్తలు వినిపిస్తుంది. ఒక భారీ అంచనాల మధ్య రూపొందించిన బాలీవుడ్ జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంసలు అయితే దక్కింది కానీ ఈ సినిమా వసూళ్ల పరంగా అంతగా రాబట్ట లేకపోయింది. అందుచేతనే ఇప్పుడు రామ్ చరణ్ డైరెక్టర్ గౌతమ్ సినిమా తో తలకెక్కించడానికి ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంపై ఎవరు క్లారిటీ ఇస్తారు అన్న విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.