ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ హీరో ఆ తరువాత ఆ పేరును నిలబెట్టుకునే సినిమా ఒకటి కూడా చేయలేదని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో ఆ సినిమా అభిమానులను కూడా ఏ మాత్రం ఆలోచించకపోవడంతో ఆయన ఆలోచించి సినిమాలు చేయవలసిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో రూపొందిన ఆది పురుష్ చిత్రం పైనే ఆయన అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా ఈ సినిమా ప్రేక్షకు ల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తప్పకుండా ఇది భారీ స్థాయిలో ప్రవేశకులను అలరిస్తుందని నమ్మకాన్ని చిత్ర బృందం వెల్లడిస్తుంది. తాజాగా సలార్ మరియు ప్రాజెక్టు కే సినిమా షూటింగ్లలో పాల్గొంటూ ఉంటున్నాడు అయితే ఇప్పటిదాకా పలు బ్రేక్ లతో ఈ సినిమా షూటింగ్లను పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు బ్రేకులు లేకుండా తన సినిమాను చేసే విధంగా ప్లాన్ చేశాడట.
తొందరగా తన సినిమాలను పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెప్పవచ్చు. తొందరలోనే ఆయన తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవు తున్నారు. ఇక ప్రభాస్ భవిష్యత్తు సినిమాల విషయానికి వస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సిని మా యొక్క షూటింగ్ మొదలు కాకపోవడం ఈ సినిమా రూపొందడానికి మరికొంత సమయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది అని అంటున్నారు.