ఎప్పటినుండో ఈటీవీలో ప్రసారం అవుతున్న మోస్ట్ పాపులర్ షో లు అయిన జబర్దస్త్.. ఎక్స్ట్రా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలకు యాంకర్ గా ఒన్ ఓన్లీ రష్మీ గౌతమ్ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించేవాడు.ఇక జబర్దస్త్ కు అనసూయ యాంకర్ గా వ్యవహరించేది.కాగా వారు ఇద్దరు కూడా వెళ్లి పోయారు.అయితే వారిద్దరి ప్లేస్ ను ఇప్పుడు తన ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు రష్మి గౌతమ్ భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక యాంకర్ గా రష్మీ గౌతమ్ అన్ని విధాలుగా మూడు షో లకు కూడా సక్సెస్ అవుతుంది.. అయ్యింది అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రష్మీ గౌతమ్ ప్రస్తుతం ఈ మూడు షో లకు యాంకర్ గా చేస్తున్న నేపథ్యంలో ఫుల్ బిజీగా ఉంది.పోతే వారంలో అయిదు ఆరు రోజుల పాటు ఆమె మల్లెమాల వారికి డేట్లు ఇవ్వాల్సి వస్తుందట. ఇక ఈ సమయంలో రష్మీ గౌతమ్ పారితోషికం కూడా భారీగా పెంచినట్లుగా తెలుస్తోంది.అయితే మొన్నటి వరకు ఒక్క కాల్షీట్ కి అంటే ఒక్క రోజు పారితోషికంగా నాలుగు నుండి అయిదు లక్షల వరకు తీసుకునేదట. అయితే కానీ ఇప్పుడు ఆ పారితోషికం ఏకంగా ఆరు లక్షలకు పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.ఇకపోతే ఒక్క రోజులో ఒక్కో ఎపిసోడ్ చొప్పున చిత్రీకరించే అవకాశం ఉంది.
ఇక తద్వారా భారీ ఎత్తున రష్మీ గౌతమ్ కు మల్లెమాల వారి నుండి పారితోషికం అందుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే భారీ ఎత్తున అంచనాలున్న ఈ మూడు ఎపిసోడ్స్ కు కూడా ఆమె యాంకరింగ్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.కాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ గుడ్ బై చెప్పిన సమయంలో మరెవ్వరైనా కూడా షో కు పెద్దగా ఆధరణ వచ్చేది కాదు. ఇకపోతే కేవలం సుధీర్ ప్రేయసిగా పేరు దక్కించుకున్న రష్మి గౌతమ్ వల్ల మాత్రమే ఆమెకు ఛాన్స్ దక్కింది.ఇక అందుకే మల్లెమాల వారు భారీ పారితోషికంను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది..!!